← Back to news

తల్లీకూతుళ్లపైకి దూసుకెళ్లిన కారు!

By sahani· 17 Jun 2026· X· Uttar pradesh

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఒక షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఒక అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్ పార్కింగ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్రితికా శర్మ తన ఐదేళ్ల కూతురు ఆర్యతో కలిసి కారులోంచి సామాన్లు తీస్తుండగా. ఒక కారు వేగంగా వచ్చి వాళ్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి ఆర్య స్వల్ప గాయాలతో బయటపడగా, క్రితికాకు తీవ్ర గాయాలవ్వడంతో ఐసీయూ (ICU)లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు కేసు బుక్ చేశారు. ఈ భయానక దృశ్యాలు సిసిటివి (CCTV)లో రికార్డ్ అవ్వగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.