మాదాపూర్ గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే

TG: యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అధికారులు, గ్రామస్థులతో ఆయన చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అర్హత ఉన్న ఓటరు పేరు తొలగిపోకుండా ఆధారాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని తెలిపారు.


