వెన్నచర్ల పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
TG: మారుమూల గ్రామాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, ప్రసూతి సేవలు, ల్యాబొరేటరీని పరిశీలించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.


