పోక్సో కేసు నిందితుడి ఆత్మహత్య

TG: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతామన్‌పల్లి గ్రామానికి చెందిన రంగబోయిన సందీప్ (23) గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గతంలో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న సందీప్ ఇటీవలే జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి బాలిక తల్లిదండ్రులు తనను బెదిరిస్తున్నారని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత బాలిక కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులతోనే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



