← Back to news

లక్షల విలువైన నగల చోరీ-పట్టించిన ఇన్ స్టా రీల్ !

By DS· 3 Jul 2026· deharadun
లక్షల విలువైన నగల చోరీ-పట్టించిన ఇన్ స్టా రీల్ !

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఒక వెరైటీ దొంగతనం కేసు వెలుగుచూసింది. ఒక ఇంట్లో పనిమనిషిగా ఉండే విమలా దేవి అనే మహిళ, దాదాపు ఏడాది క్రితం యజమాని ఇంట్లోంచి ₹10 లక్షల వర్త్ గల డైమండ్ నెక్లెస్, గోల్డ్ లాకెట్ దొంగిలించింది. అప్పట్లో ఓనర్ అడిగితే తనేం తీయలేదంటూ బుకాయించింది. కట్ చేస్తే.. రీసెంట్‌గా ఆ పనిమనిషి దొంగిలించిన నగలు వేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చేసి వా ట్సాప్ స్టేటస్ పెట్టింది. అది చూసిన ఓనర్ ఫ్రెండ్ వెంటనే అలర్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఓనర్ ఇచ్చిన కంప్లైంట్‌తో పోలీసులు విమలా దేవిని అరెస్ట్ చేసి, ఆమె దొంగిలించిన నగలను రికవర్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 19h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.