← Back to news

20రోజులైనా దొరకని చిన్నారి ఆచూకీ.. తల్లి ఆస్పత్రిపాలు

By DK· 25 Jun 2026· కాకినాడ జిల్లా
20రోజులైనా దొరకని చిన్నారి ఆచూకీ..  తల్లి ఆస్పత్రిపాలు

AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో మిస్సైన చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) ఆచూకీ 20 రోజులు దాటినా దొరకలేదు. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ, బిడ్డ దూరమవడంతో జ్ఞానేశ్వరి తల్లి భవానికి తీవ్రమైన దిగులుతో మంచాన పడ్డారు. నిద్ర, ఆహారం లేక ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. చిన్నారి ఆచూకీ కోసం అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఏ చిన్న ఆధారాన్నీ వదిలిపెట్టకుండా ముమ్మరంగా గాలిస్తున్నారు.

20రోజులైనా దొరకని చిన్నారి ఆచూకీ..  తల్లి ఆస్పత్రిపాలు

More in AP