పోలీసుపై పిడిగుద్దులు
TG: గచ్చిబౌలిలో పోలీసుపై దాడి చేసిన RMP డాక్టర్ సునీల్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. నానక్‌రామ్‌గూడలో 112 కంప్లయింట్‌పై విచారణకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ శివకుమార్‌తో RMP డాక్టర్ వాగ్వాదానికి దిగారు. ఆయన ఫోన్‌ను నేలకేసి కొట్టి, కాలర్ పట్టుకుని ముఖంపై పిడిగుద్దులు గుద్దినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసుకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి, సునీల్‌ను అరెస్ట్ చేశారు. తర్వాత ఎర్రగడ్డ హాస్పిటల్‌కి తరలించినట్లు సమాచారం.


