← Back to news

చెట్టుకొమ్మ పట్టుకుని బతికిన బాలుడు

By DK· 17 Jul 2026

TG: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఊరుబాటి సుధాకర్, వసంత(35) దంపతులకు నవ్య(15), కుమారుడు వేణు ఉన్నారు. సుధాకర్‌ రోజూ మద్యంమత్తులో భార్యతో గొడవపడుతూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో వసంత, ఇద్దరు పిల్లలతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు నీటిలో మునిగిపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. అయితే వేణుకు నీటిపైకి వంగి ఉన్న చెట్టుకొమ్మ తగలడంతో గట్టిగా పట్టుకుని వేలాడుతూ ఉండిపోయాడు. బావుల వద్ద వెతికిన భర్తకు, కుమారుడి అరుపులు వినిపించడంతో కొడుకును రక్షించాడు.

More in TG