← Back to news

నిద్రలో ఉన్న భార్యపై ఇటుకతో దాడి

By dk· 12 Aug 2026· మేడ్చల్ జిల్లా
నిద్రలో ఉన్న భార్యపై ఇటుకతో దాడి

TG: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని ద్వారకానగర్‌లో మాధవి (37)ని ఆమె భర్త కాట్రావత్ రాజు సిమెంట్ ఇటుకతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 18ఏళ్ల క్రితం వివాహమైన ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా రాజు మద్యానికి బానిసై భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గత అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజు.. కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో మాధవిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

More in TG