← Back to news

UPSC సాధించలేక నకిలీ అవతారాలెత్తిన ఘనుడు !

By DS· 16 Jul 2026· ndtv· Uttarakhand
UPSC సాధించలేక నకిలీ అవతారాలెత్తిన ఘనుడు !

ఉత్తరాఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్ రామస్వామి కుమారుడు యశ్‌వర్ధన్‌ను డెహ్రాడూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఐపీఎస్ ఆఫీసర్, రా (RAW) ఏజెంట్ , ఆర్మీ సోల్జర్‌గా నకిలీ అవతారాలెత్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుండి లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడు. నిందితుడి వద్ద నుండి 5 ఫేక్ ఐడీ కార్డులు, ఆర్మీ యూనిఫారాలు, వైర్‌లెస్ సెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూపీఎస్‌సీ (UPSC) క్లియర్ చేయలేక, అధికారం కోసం అతను ఈ మోసాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 17h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.