సైబర్ క్రైం బాధితులకు రూ.98.89 లక్షలు రికవరీ

TG: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జూలైలో 70 FIRలు నమోదు చేశారు. 15 రాష్ట్రాల ట్రేడింగ్ ఫ్రాడ్, సోషల్ మీడియా ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ తదితర కేసులపై 49 మందిని అరెస్టు చేశారు. 38 ప్రధాన కేసుల్లో బాధితులు రూ.13.87 కోట్లు నష్టపోగా, అందులో రూ.98.89 లక్షలు రీఫండ్ చేశారు. జోనల్ సైబర్ సెల్స్ 2,059 NCRP పిటిషన్లు తీసుకుని 298 FIRలు నమోదు చేశాయి. సైబర్ పెట్రోల్‌లో 128 ఫేక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ తొలగించారు.



