కీలక ప్రాజెక్టులకు AP కేబినెట్ ఆమోదం

రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే పలు కీలక ప్రాజెక్టులకు AP కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.30,353 కోట్ల పెట్టుబడితో 34,610 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డేటా సెంటర్లు, సోలార్ ప్రాజెక్టులు, ఎనర్జీ రంగంలో పెట్టుబడుల ఆమోదంపై చర్చించి నిర్ణయం తీసుకుంది. అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. C-డాట్, ఆటోమియామిక్స్ ఇండియా, క్యూపీఐ AI ఇండియా, ప్రూగల్ AI హబ్ సహా 11 సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.



