← Back to news

ఆదివాసీ విద్యార్థులకు వసతుల కల్పన అవసరం

By A.Ajay· 3h ago
ఆదివాసీ విద్యార్థులకు వసతుల కల్పన అవసరం

TG: రాష్ట్రంలో ప్రభుత్వ బడుల పరిస్థితులను ప్రజల ముందు పెట్టేందుకు TPF(Telangana People’s Front) <a href="https://www.theclearcutnews.com/n/FzfgcvX">బస్సు యాత్ర</a> చేస్తోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మల్కాపూర్ గిరిజన గ్రామంలో రిటైర్డ్ IAS ఆకునూరి మురళి పర్యటించారు. ఆదివాసీ ప్రాంతాల్లో విద్యకు ఎదురవుతున్న సమస్యలపై మాట్లాడారు. ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపే ఆర్థిక పరిస్థితి చాలా కుటుంబాలకు లేదనీ, గ్రామాలకు రవాణా సౌకర్యం కూడా లేదన్నారు. ఆదివాసీ పిల్లలకూ ఇతర ప్రాంతాల విద్యార్థులతో సమానంగా నాణ్యమైన విద్య అందించాలని కోరారు.

More in TG

మల్కాపూర్ బడి నిండా సమస్యలు: సృజన యాదవ్
TG· 1h ago

మల్కాపూర్ బడి నిండా సమస్యలు: సృజన యాదవ్

TG: ఆదివాసీ గ్రామాల్లోని పిల్లల పరిస్థితులు చూస్తే బాధగా ఉందని సృజన యాదవ్ అన్నారు. TPF<a href="https://www.theclearcutnews.com/n/Aq6od2X"> విద్యా బస్సుయాత్ర</a>లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మల్కాపూర్‌లో ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు తరగతులు ఉన్నాయని చెప్పారు. ఇద్దరు టీచర్లు, రెండు గదులు ఉండగా ఒక గదిలో సామగ్రి ఉండటంతో పిల్లలు వరండాలో కూర్చొని చదువుకుంటున్నారని తెలిపారు. నాలుగు బాత్రూమ్‌లలో మూడు పనిచేయడం లేదని, నల్లాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. ఇద్దరు టీచర్లలో ఒకరు సెలవులో ఉంటే ఒక్క టీచర్‌తోనే పాఠశాల కొనసాగుతోందన్నారు.