నల్ల బ్యాడ్జీలతో విధులకు.. కాంట్రాక్ట్ సిబ్బంది నిరసన

AP: తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ వైద్య, పారామెడికల్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ జేఏసీ ఆదేశాల మేరకు గురువారం పల్నాడు జిల్లా శావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నిరసన చేపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, 100 శాతం గ్రాస్ జీతం అమలు చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు. ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించేలా రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలని కోరారు.


