నలుగురు దారుణ హత్య... వీడని మిస్టరీ

TG: నల్గొండ పట్టణంలోని సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో నలుగురు కుటుంబసభ్యులు దారుణ హత్య మిస్టరీ వీడడం లేదు. నాలుగు హత్యలు ప్లాన్ ప్రకారమే జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. నలుగురి హత్యలకు సంబంధించి ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. తండ్రి సుల్తాన్‌కు ఆరు కత్తిపోట్లు, కుమారుడు ముజామ్మిల్‌కు 12, హసీనాకు 8, కూతురు అప్సర్ శరీరంపై తొమ్మిది కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కానీ హత్యలకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన ఆనవాళ్లు సేకరించడం పోలీసులకు సవాల్‌గా మారింది.




