← Back to news

ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదం.. స్టూడెంట్ మృతి

By dk· 6 Aug 2026· హైదరాబాద్
ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదం.. స్టూడెంట్ మృతి

TG: సికింద్రాబాద్ తిరుమలగిరి PS పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కాలేజ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. లాల్‌బజార్ నుంచి డెయిరీ ఫామ్ వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు మరో ద్విచక్ర వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టారు. ప్రమాద తీవ్రతకు ఒకరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరొకరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

More in TG