గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

TG: హైదరాబాద్ గచ్చిబౌలి AMB మాల్ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు వెళ్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ (బుల్లెట్) బైక్‌ను, హఫీజ్‌పేట్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తున్న స్కూటీ ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొట్టింది. స్కూటీ నడిపిన శ్రీకాంత్, వెనుక కూర్చున్న విఠల్ ఇద్దరూ స్పాట్‌లోనే మృతి చెందారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడుపుతున్న వినోద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



