← Back to news

ప్రిగ్నెంట్ అయిన భార్య కోసం గవర్నర్ కాన్వాయ్ ను అడ్డగించి...

By DS· 1 Jun 2026· bangalore

కర్ణాటకలో గర్భవతిగా ఉన్న భార్యను తీసుకువెళ్లేందుకు..గవర్నర్‌ కాన్వాయ్‌ను అడ్డగించి ఓ యువకుడు సంచలనం సృష్టించాడు.. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్‌ కాన్వాయ్ వెళ్లడం కోసం 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌ను పోలీసులు నిలిపివేశారు. దాంతో ప్రిగ్నెంట్ అయిన తన భార్యను ఆస్పత్రికి తరలించాలంటూ ఓ వ్యక్తి గవర్నర్ కాన్వాయ్ వెళ్లే రూట్ లో నడిరోడ్డుపై బైఠాయించాడు. తన భార్యకు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి వెడుతుండగా ట్రాఫిక్ లో చిక్కుకు పోయానంటూ అసహనం వ్యక్తం చేశాడు.

More in News