తుర్కపల్లి ప్రెస్‌క్లబ్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

TG: నల్గొండ జిల్లా కనగల్ మండలం తుర్కపల్లిలో సీనియర్ జర్నలిస్టుల ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జర్నలిస్టుల సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి. ఆంజనేయులు, గౌరవాధ్యక్షుడిగా సూర్యంరాజు, ఉపాధ్యక్షుడిగా నర్సింహులు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రాజ్‌కుమార్‌గౌడ్, సహాయ కార్యదర్శిగా శేఖర్, కోశాధికారిగా రాజ్‌కుమార్, సలహాదారుడిగా రాంనర్సింహారెడ్డి బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు మరో తొమ్మిది మందిని కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు.


