← Back to news

ఏపీ జిల్లాలకు వర్షం హెచ్చరిక

By RK· 20 Jul 2026
ఏపీ జిల్లాలకు వర్షం హెచ్చరిక

AP: రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రేపు(మంగళశారం) వర్షాలు పడతాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల మార్పు వల్ల తీరప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రజలు పిడుగుల సమయంలో చెట్లు, కరెంట్ స్తంభాల కింద నిలబడకూడదని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.

More in AP