కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు....వచ్చే వారం తెలుగు రాష్ట్రాలలోకి
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి ఎట్టకేలకు కేరళను తాకింది. ఈ రోజు మధ్యాహ్నం నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడం ద్వారా భారత్ లో ఎంటరయ్యాయి. మరికొద్దిరోజుల్లో ఈ రుతుపవనాలు దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతాయి. వచ్చే వారం ఏపీ, తెలంగాణలలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందన్నది వాతావరణ శాఖ అంచనా. నైరుతి ప్రభావంతో విస్తారంగా వానలు పడే ఛాన్స్ ఉంది. అయితే ఈసారి ఎల్ నినో కారణంగా వర్షాలు కాస్త తక్కువగా పడే అవకాశముందని IMD ఇప్పటికే చెప్పింది.



