పట్టపగలే గుడి దగ్గర గుప్త నిధుల వేట

TG: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయన్న ప్రచారం కలకలం రేపుతుంది. గ్రామ సమీపంలోని పురాతన దేవాలయం సందెరెల్లి గుల్ల వద్ద భారీగా మట్టి తవ్వి గుంత ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తవ్వకాలకు ఉపయోగించిన పరికరాలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై చర్చ జరుగుతోంది. అర్ధరాత్రి, పట్టపగలే తవ్వకాలు జరుగుతుంటే పోలీసులకు, రెవెన్యూ అధికారుల కళ్లకు కనిపించడం లేదా అని, లేక సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోవట్లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



