← Back to news

స్నాప్‌చాట్‌లో పరిచయం పెంచుకుని బ్లాక్‌మెయిల్

By DK· 28 Jun 2026· హైదరాబాద్‌
స్నాప్‌చాట్‌లో పరిచయం పెంచుకుని బ్లాక్‌మెయిల్

TG: సోషల్ మీడియా వేదికలైన స్నాప్‌చాట్ తదితర యాప్‌ల ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడు నాగతేజ అలియాస్ నానిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలను లోబర్చుకుని, వారి అశ్లీల ఫొటోలు, వీడియోలతో బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఓ హోటల్ గదిలో మహిళను కత్తితో బెదిరించి ఆమె అశ్లీల వీడియోలను రికార్డు చేశారని అన్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ రూ.1.10 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 22h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.