చోరీల డబ్బుతో హారర్ మూవీ.. షాకింగ్ ట్విస్ట్

AP: కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మంగళూరు రేవులో వెల్డింగ్ పనులు చేసే ఆనంద్‌కు సినిమాలు చాలా ఇష్టం. ఎప్పటికైనా తానే ఓ మూవీ తీయాలనుకున్నాడు. దీంతో చోరీల బాటపట్టాడు. షాపింగ్ మాల్సే టార్గెట్‌గా అనంతపురంలోని డ్రెస్ సర్కిల్ మాల్‌లో నగదు చోరీ చేశాడు. ఇలా దోపిడీలు చేసి కూడగట్టిన రూ.2.5 కోట్లతో హీరో, దర్శకుడిగా రిటర్న్ బై ఆనంద్.. పేజీ నంబర్ 13 అనే హారర్ మూవీ తీశాడు. అప్పులు పెరగడంతో మళ్లీ చోరీలు చేస్తూ పోలీసులకు దొరికాడు. బెంగళూరు-అనంతపురం హైవేపై నిందితుడిని అరెస్ట్ చేశారు. లాడ్జిల్లో ఉంటే దొరుకుతానని కారులోనే తిరిగేవాడని పోలీసులు తెలిపారు.



