← Back to news

లవర్ కోసం జైలు గోడ దూకిన ఖైదీ!

By sahani· 6 Jul 2026· mahabobnagar
లవర్ కోసం జైలు గోడ దూకిన ఖైదీ!

మహబూబ్‌నగర్ జైలు నుండి POCSO కేస్ రిమాండ్ ఖైదీ కిషోర్ కుమార్ (22) పరారయ్యాడు. వనపర్తి సఖి కేంద్రంలో ఉన్న తన లవర్‌ని కలవడానికి.. సోమవారం తెల్లవారుజామున బాత్రూమ్‌కి వెళ్తున్నానని చెప్పి, 4 టవల్స్ సాయంతో జైలు గోడ దూకి ఎస్కేప్ అయ్యాడు. అమరచింత మండలానికి చెందిన ఈ ఖైదీ 25 రోజుల క్రితమే అరెస్టయ్యాడు. ఈ ఘటనపై DIG చౌహాన్ జైలు సూపరింటెండెంట్ శశికాంత్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం వన్‌టౌన్ పోలీసులు ఖైదీ కోసం వెతుకుతున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 20h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.