పెయింట్ షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం

AP: అనకాపల్లి జిల్లా S.రాయవరం మండలం అడ్డురోడ్డు జంక్షన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పెయింట్స్ షాపులో పెద్ద ఎత్తున కెమికల్స్, స్పిరిట్, డబ్బాలు నిల్వ ఉండటంతో మంటలు క్షణాల్లో తీవ్రరూపం దాల్చిచనట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.



