← Back to news

గీత కార్మికుడి హైటెక్ ఐడియా

By dk· 7 Aug 2026· యాదాద్రిభువనగిరి జిల్లా
గీత కార్మికుడి హైటెక్ ఐడియా

TG: యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన గీత కార్మికుడు శ్రవణ్ గౌడ్ వినూత్న ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాను కష్టపడి సేకరించిన కల్లును రాత్రివేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలిస్తుండటంతో తీవ్రంగా నష్టపోయేవాడు. దీంతో దొంగతనాలను అరికట్టేందుకు ఏకంగా తాటిచెట్టుకే సోలార్ CC కెమెరాలు అమర్చాడు. కరెంట్ అవసరం లేకుండా పనిచేసే కెమెరాను కల్లు ముంతలు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసి, దాని లైవ్ దృశ్యాలను తన మొబైల్‌లో చూసేలా సదుపాయం కల్పించుకున్నాడు. దీంతో దొంగలు అటువైపు రావడం మానేశారు.

More in TG