← Back to news

గంజాయి ముఠా రాళ్లదాడి.. గాల్లోకి కాల్పులు

By DK· 10 Jun 2026· Eenadu· అల్లూరిసీతారామరాజు జిల్లా
గంజాయి ముఠా రాళ్లదాడి.. గాల్లోకి కాల్పులు

AP: అల్లూరిసీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని లోతుగెడ్డ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయితో వస్తున్న కారును తనిఖీ చేస్తుండగా అందులో ఉన్న ముఠా సభ్యులు హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులపై రాళ్లతో దాడిచేశారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించగా, నలుగురిని పట్టుకున్నారు. నిందితులు ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. 290కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.