← Back to news

హైవేపై యాక్షన్ సీన్.. దుండగులపై పోలీసుల ఫైరింగ్

By డీకే· 2 Jul 2026· నంద్యాల జిల్లా
హైవేపై యాక్షన్ సీన్.. దుండగులపై పోలీసుల ఫైరింగ్

AP: నంద్యాల జిల్లా డోన్ హైవేపై గురువారం తెల్లవారుజామున పోలీసులు కాల్పుల ఘటన కలకలం రేపింది. పందుల లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా, దుండగులు ఎదురు దాడిచేశారు. వాహనాన్ని ఆపకుండా ఓవర్ స్పీడ్‌తో వెళ్లిపోయారు. పోలీసులు ఆ వాహనాన్ని వెంబడిస్తూనే హైవే పెట్రోలింగ్ పోలీసులకు సమాచారమిచ్చారు. వాహనాన్ని అడ్డుకునేందుకు పెట్రోలింగ్ పోలీసులు యత్నించగా, రాళ్లు, సీసాలు విసిరి దాడిచేశారు. దీంతో దొంగలపై కాల్పులు జరిపారు. దుండగులు పోలీసులకు చిక్కకుండా పరార్ అయ్యారు.

More in AP