రెండు గ్రామాల మధ్య వివాదం.. ఉద్రిక్తత

AP: పల్నాడు జిల్లాలో బయ్యవరం, మునగోడు గ్రామస్థుల మధ్య కృష్ణానది జలాల ఊరేగింపు ఉద్రిక్తతకు దారితీసింది. సాంప్రదాయం ప్రకారం గ్రామదేవత పూజ కోసం కొందరు కృష్ణానదికి వెళ్లారు. వాళ్లను గ్రామ సెంటిమెంట్ దెబ్బతింటుందని మునగోడు గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. పల్నాడు పోలీసులు భారీ బందోబస్తుతో ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో చర్చించారు. పోలీసులు వేగంగా స్పందించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులోకి వచ్చింది.



