సోషల్ మీడియాతోనే ప్రభుత్వాల్లో జవాబుదారీతనం: కేటీఆర్
సోషల్ మీడియా శక్తి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్ధరాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టాల్సి వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాకు హద్దు, పరిమితి ఉంటే బాగుంటుంది, కానీ ఆ హద్దులను ఎవరు నిర్ణయిస్తారని ఆయన ప్రశ్నించారు. వార్తలలో పాజిటివ్, నెగెటివ్‌లు రాస్తూ, అడ్వర్టైజ్‌మెంట్లు మాత్రం ఆపకండి అని కోరే మీడియా కంటే, ప్రభుత్వాల జవాబుదారీతనానికి, ప్రజలకు స్వేచ్ఛగా సమాచారం అందించడానికి సోషల్ మీడియానే మెయిన్ ప్లాట్‌ఫామ్‌గా మారిపోయిందని కేటీఆర్ స్పష్టంగా చెప్పారు.



