పోలీసులు 'జుట్టు' లాగలేదు.. విద్యార్థిని క్లారిటీ
AP: తిరుపతిలో స్టైఫండ్ కోసం ధర్నాచేస్తున్న పారామెడికల్ విద్యార్థినిని, ఓ పోలీస్ జుట్టు పట్టి లాగినట్లు నిన్న ఓ <a href="https://www.theclearcutnews.com/n/fUyA22F">వీడియో వైరల్</a> అయింది. దీనిపై ఆ విద్యార్థిని క్లారిటీ ఇచ్చారు. “పోలీసులు నా చేయి పట్టుకొని లాగుతూ ఉంటే జుట్టు తగిలింది అంతే. జుట్టు లాగలేదు. అదంతా తప్పుడు ప్రచారం” అని చెప్పారు. తిరుపతి అలిపిరి దగ్గర జరిగిన ఈ ఘటన హాట్ డిబేట్ అయ్యింది. పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. విద్యార్థిని స్వయంగా ఖండించడంతో ఈ వివాదానికి బ్రేక్ పడే ఛాన్స్ ఉంది.



