కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు సీరియస్

TG: హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలోని సల్కం చెరువు భూమి వ్యవహారంలో హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పలువురు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, హైడ్రా కమిషనర్ AV రంగనాథ్‌తో పాటు విద్య, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులకు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.



