నీటి చుక్క కోసం అన్నదాత ఆరాటం

TG: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఖరీఫ్ సాగు సంక్షోభంలో చిక్కుకుంది. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు ఖాళీగా ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాల ఆధారంగా వేసిన వరి, పత్తి తదితర పంటలు ప్రస్తుతం నీళ్లు లేక ఎండిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని దాదాపు అన్ని మండలాలు సాధారణ వర్షపాతం కంటే 33 శాతానికి పైగా లోటులోకి వెళ్లిపోయాయి. హన్మకొండ జిల్లాలో అత్యధికంగా 67 శాతం లోటు నమోదు కాగా, మేడ్చల్ జిల్లాలో 60 శాతం మైనస్ వర్షపాతం నమోదైంది.



