సినిమా రేంజ్‌లో నవ వధువు కిడ్నాప్

TG: కులాంతర వివాహం చేసుకున్న ఓ నవ వధువును ఆమె కుటుంబసభ్యులే కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. మెదక్ జిల్లా ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రణయ్, ఓ యువతిని ప్రేమించి ఈ నెల 6న కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లి వధువు కుటుంబసభ్యులకు ఇష్టం లేదు. దీంతో వారంతా తమ అమ్మాయిని ఎలాగైనా కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకురావాలని ప్లాన్ చేశారు. వరుడు ప్రణయ్ ఇంటికి నాలుగు కార్లలో సైలెంట్‌గా వచ్చి చుట్టుముట్టారు. బలవంతంగా ఇంట్లోకి చొరబడి యువతిని తమవెంట లాక్కెళ్లారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన ప్రణయ్, అతడి కుటుంబసభ్యులను సైతం కార్లలో ఎత్తుకెళ్లారు.



