హైవేపై అదుపుతప్పిన కారు.. పొలాల్లో బోల్తా

AP: తిరుపతి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెలు మృతి చెందారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న చిన్నగొట్టిగల్లు మండలంలోని బోడిరెడ్డి గారిపల్లెకి చెందిన అనిల్‌కుమార్ తన భార్య మానస, మరదలు గౌతమితో కలిసి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. వి.కోట మండలం రామాపురం సమీపంలో కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. గౌతమి అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన మానసను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. అనిల్‌కుమార్ గాయాలతో చికిత్స పొందుతున్నారు.



