← Back to news

లా స్టూడెంట్‌పై తప్పుడు కేసు..

By sahani· 1d ago· Thehindu· Uttar pradesh
లా స్టూడెంట్‌పై తప్పుడు కేసు..

నోయిడా ప్రొటెస్ట్ కేసులో ఢిల్లీ యూనివర్సిటీ లా స్టూడెంట్ ఆకృతి చౌదరిపై పెట్టిన NSA డిటెన్షన్‌ను అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. శాలరీ పెంపు కోసం జరిగిన కార్మికుల నిరసనల్లో 25 ఏళ్ల ఆకృతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఐదు నెలలుగా ఆమె కస్టడీలో ఉంది. పోలీసులు చూపించిన అరెస్ట్ టైమింగ్స్, ఆధారాల్లో అవకతవకలు ఉన్నాయని జస్టిస్ అతుల్ శ్రీధరన్ బెంచ్ గుర్తించింది. ఈ కేసు మొత్తం ప్రభుత్వం అల్లిన కల్పిత కథ అని మండిపడుతూ, తప్పుడు అరెస్ట్‌కు నోయిడా అడ్మినిస్ట్రేషన్ ఆమెకు రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

More in Current Affairs