← Back to news

రేపు చికెన్, మటన్ షాపులు బంద్.. రీజన్ ఇదే!

By sahani· 1d ago· Deccanchronicle· Hyderabad
రేపు చికెన్, మటన్ షాపులు బంద్.. రీజన్ ఇదే!

శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగన సందర్బంగా రేపు హైదరాబాద్ (GHMC) పరిధిలోని అన్ని మాంసం దుకాణాలను క్లోజ్ చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. నగరంలోని రిటైల్ చికెన్, మటన్, బీఫ్ షాపులతో పాటు GHMC గుర్తింపు పొందిన పశువధశాలలన్నీ కచ్చితంగా బంద్ పాటించాలని కమిషనర్ చెప్పారు. ఒకవేళ రూల్స్ బ్రేక్ చేసి ఆ రోజు సీక్రెట్‌గా మాంసం అమ్మినా, జంతువులను చంపినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వెటర్నరీ టీమ్స్ ఆ రోజు అన్ని చోట్లా స్పెషల్ తనిఖీలు చేయనున్నాయి.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 38m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.