ఒకే నూనె.. వంద వంటలు..ఆరోగ్యం సంగతేంటి?

బాపట్లకు చెందిన 38 ఏళ్ల రమేష్ బయట దొరికే జంక్ ఫుడ్, నూనెలో వేయించిన వాటిని తినడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి హార్ట్ ప్రాబ్లమ్ తెచ్చుకున్నాడు. స్ట్రీట్ ఫుడ్ బండ్లపై ఒకే నూనెను మళ్లీ మళ్లీ వాడి బజ్జీలు, గారెలు, దోసెలు వేస్తున్నారు. దీనివల్ల 16 నుండి 30 ఏళ్ల యూత్‌లో క్యాన్సర్లు, ఇతర జబ్బులు పెరుగుతున్నాయని NCD 4.0 సర్వేలో తేలింది. బయటి నూనె పదార్థాల వల్ల ఆరోగ్యం పాడుచేసుకోవద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.


