DJ సౌండ్‌తో స్కూల్‌లో స్టూడెంట్ మృతి
UPలోని బలరాంపూర్‌లో దారుణ ఘటన జరిగింది. గణేశ్ నిమజ్జన ఊరేగింపులో భారీ DJ సౌండ్‌తో దగ్గరలోని డివైన్ పబ్లిక్ స్కూల్‌లో 7 ఏళ్ల, 2వ తరగతి విద్యార్థిని వైష్ణవి ఒక్కసారిగా కుప్పకూలింది. టీచర్లు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా, డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన CCTV ఫుటేజ్ బయటకొచ్చింది. DJ సౌండ్‌కు, స్టూడెంట్ మృతికి నేరుగా సంబంధం ఉందా? అనే అంశంపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కుటుంబం నుంచి ఇప్పటివరకు కంప్లైంట్ రాలేదు.



