రజినీకాంత్ ‘రోబో’ సినిమా.. రియల్‌గా జరిగింది
మనిషితో రోబో ఫైట్ చేయడం రజినీకాంత్ ‘రోబో’ సినిమాలో చూశాం కదా! అలాంటి సంఘటనే అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగింది. ఆరడుగుల రోబోతో ఇన్‌ఫ్లుయెన్సర్ ఫ్రాంకీ లాపెన్నా బాక్సింగ్ రింగ్‌లో తలపడ్డాడు. లాపెన్నా పంచ్‌లు విసరగా, రోబో కిక్కులు, పంచ్‌లతో కౌంటర్ ఇచ్చింది. ఓ కిక్‌కు లాపెన్నా కిందపడిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోబోటిక్స్ సంస్థ ఆర్‌ఈకే నిర్వహించిన ఈ పోటీ ప్రపంచంలో తొలి మనిషి-రోబో ఫైట్ అని తెలిపింది. ట్విస్ట్ ఏంటంటే..ఆ రోబోను రిమోట్‌తో ఓ వ్యక్తి ఆపరేట్ చేశాడు.



