రద్దయిన NLSIU కాన్వగేషన్ వేడుక

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ(NLSIU) సెప్టెంబర్ 12న జరగాల్సిన 34వ కాన్వగేషన్ వేడుకను రద్దు చేసింది. CJI సూర్య కాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(BCI) చైర్మన్‌ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడాన్ని విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. యాజమాన్యం, విద్యార్థి సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రిజిస్ట్రార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లను కొరియర్ ద్వారా లేదా నేరుగా క్యాంపస్ లో ‘ఇన్ అబ్సెంటియా’ (In-absentia) పద్ధతిలో అందజేయనున్నారు.



