విద్యుత్ స్తంభాలు రెడీ.. కనెక్షన్ ఎప్పుడు?

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి శివారులోని ఎద్దగట్టుతండాకు వెళ్లే రహదారిలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినా తీగలు అమర్చకపోవడంతో సమస్య నెలకొంది. దీంతో తండావాసులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై TGSPDCL అధికారి హేమంత్‌గౌడ్‌ను వివరణ కోరగా.. వ్యక్తిగతంగా స్తంభాలు ఏర్పాటు చేశారని, గ్రామపంచాయతీ నుంచి నిధులు కేటాయిస్తే తీగలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.



