హైవేపై లారీలో భారీ మంటలు
TG : హైదరాబాద్ బాటసింగారం మార్కెట్ దగ్గర విజయవాడ హైవేపై ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకి లారీకి కరెంట్ వైర్లు తగలడంతో షార్ట్ సర్క్యూట్ అయి భారీగా మంటలు చెలరేగాయి. నిప్పులు ఒక్కసారిగా ఎగిసిపడటంతో అక్కడున్న జనాలు భయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


