నాలుగేళ్లు శవాన్ని భద్రపరిచిన కుటుంబసభ్యులు

ముంబయిలో 80 ఏళ్ల వ్యక్తి శవాన్ని అతని కుటుంబం నాలుగేళ్లుగా ప్రైవేట్ క్లినిక్ ఫ్రీజర్‌లో భద్రపరిచింది. మలాడ్ ప్రాంతంలోని ఒక పాలీక్లినిక్ ఫ్రీజర్‌లో ఆ వృద్ధుడి శవం ఉంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో కురార్ పోలీసులు క్లినిక్‌కు వెళ్లి చూశారు.<br>ఆ వ్యక్తి 2022లో చనిపోయాడు. ‘అతని శరీరాన్ని ఎంతకాలం అయినా భద్రపెట్టాలని అనుకున్నాం. అందుకోసం అమెరికాలోని క్రయోనిక్స్ సెంటర్‌కు పంపించాలని చూస్తున్నాం’ అని అతని కుటుంబసభ్యులు చెప్పారు.



