← Back to news

దేశం కోసం ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలి

By dk· 15 Aug 2026· కరీంనగర్ జిల్లా
దేశం కోసం ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలి

TG: కరీంనగర్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం పోలీస్‌ వాహనంలో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమం, రైతుల అభివృద్ధి, మహిళలు, విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వివరించారు. రాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

More in TG