చెరువులో విగ్రహం కోసం గాలింపు ముమ్మరం

TG: హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తేజస్విని మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఫీర్జాదిగూడలోని సమీపంలోని ఓ ఆలయంలోకి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని చెరువులోకి దూకినట్లు గుర్తించారు. తేజస్విని మృతదేహం లభించగా, కేసులో విగ్రహం కీలక ఆధారంగా మారే అవకాశం ఉండటంతో DRF సిబ్బంది బోట్ల సహాయంతో విగ్రహం కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె నెలకు దాదాపు రూ. లక్ష అద్దె చెల్లిస్తున్న ఫ్లాట్, ఆర్థిక లావాదేవీలు, డెత్ డిక్లరేషన్, CCTV ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.



