నికోబార్ ప్రాజెక్టులకు బ్రేక్ చెప్పిన UN కమిటీ!

గ్రేట్ నికోబార్‌లో చేపట్టనున్న భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై యునైటెడ్ నేషన్స్ కమిటీ కీలక సూచనలు చేసింది. పర్యావరణం, ఆర్థిక, సామాజిక అంశాలపై పూర్తి స్థాయి డీటెయిల్డ్ స్టడీ పూర్తయ్యే వరకు ప్రాజెక్టు పనులను టెంపరరీగా ఆపివేయాలని కోరింది. ఈ ప్రాజెక్టుల వల్ల అక్కడి దట్టమైన అడవులు, ఎకోసిస్టమ్, స్థానిక గిరిజన జీవనంపై ఎఫెక్ట్ పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి రిసెర్చ్ స్టడీస్ చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని సూచించింది.



