← Back to news

కలకలం రేపుతున్న డెంగీ కేసులు

By Balakrishna· 21 Jul 2026
కలకలం రేపుతున్న డెంగీ కేసులు

TG: కురుస్తున్న వర్షాల కారణంగా డెంగీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో దోమల వ్యాప్తి పెరిగింది. పగటిపూట కుట్టే దోమల పట్ల ప్రజలు తీవ్ర జాగ్రత్తలు వహించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, వారానికి ఒకసారి నీటి పాత్రలను శుభ్రం చేయాలని సూచించారు. తీవ్రమైన జ్వరం, ఒంటినొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను కలిసి రక్తపరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు.

More in Health