లాఠీ చార్జిని నిరసిస్తూ ఉద్యమానికి అన్నాహజారే సిద్ధం !

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును బలప్రయోగంతో అణచివేయడం సరైన పద్ధతి కాదని, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తాను స్వయంగా ఉద్యమం చేపడతానని హెచ్చరించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసి శాంతియుత పరిష్కారం కోరారు. అవినీతి వ్యతిరేక జన్ లోక్‌పాల్ ఉద్యమం, సమాచార హక్కు (ఆర్టీఐ), రైతులు, గ్రామీణాభివృద్ధి వంటి పలు ప్రజా సమస్యలపై గతంలో దేశవ్యాప్తంగా అన్నా హజారే అనేక ఉద్యమాలను లీడ్ చేశారు.



